తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్‌లో భాగంగా గురువారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టేందుకు సభ జరిగింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
ఈ క్రమంలోనే సభ 15 నిమిషాలు వాయిదా పడగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘ఎదుటివారి చావును కోరుకునే నాయకుడిని మనం ఎక్కడైనా చూసామా.. తెలంగాణ రాష్ట్రానికి 10 ఏండ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని మార్చురీకి పంపుతా అనడం సరికాదు’ అని సీఎం రేవంత్ మీద మండిపడ్డారు. కాగా, నిన్న సీఎం మాట్లాడుతూ..కేసీఆర్ ప్రస్తుతం స్ట్రెచ్చర్ మీద ఉన్నాడని త్వరలోనే మార్చురీకి పంపుతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.