SLBC టన్నెల్ ప్రమాదం లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదం జరిగి దాదాపు 44 రోజులు పూర్తయింది. అయినప్పటికీ మిగిలిన ఆరు మంది కార్మికుల ఆచూకీ ఎక్కడ కనిపించలేదు. ఇప్పటివరకు రెండంటే రెండు మృతదేహాలను మాత్రమే వెలికి తీశాయి రెస్క్యూ టీమ్స్. 44 రోజులైనా కూడా మిగిలిన 6 మంది కార్మికుల రాజకీయం కావడం లేదు.

ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే SLBC టన్నెల్ లోపల… తాజాగా కన్వేర్ బెల్ట్ పునరుద్ధరించారు అధికారులు. దీంతో స్టీల్, బురద, మట్టి, నీళ్లు అలాగే రాళ్లు అన్ని తొలగిస్తున్నారు అధికారులు. టన్నెల్ లోపల 30 మీటర్లు డేంజర్ జోన్ లో ఉంది. సహాయక చర్యలలో పాల్గొనేందుకు… ఇవాళ కూడా రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్తున్నాయి. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ అధ్యయనం చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.