హిందువులందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే శ్రీరామనవమి ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీన రావడం జరిగింది. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష నవమి తిధి నాడున శ్రీ రామనవమిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. శ్రీ రాముడు పుట్టిన రోజున ఘనంగా సీతారాముల కల్యాణాన్ని కూడా నిర్వహిస్తారు. పెళ్లి కాని వారు ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తే త్వరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. అలాగే శ్రీ రామనవమి రోజున దానం చేస్తే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో జీవించవచ్చని భావిస్తారు. ఈ పండుగ రోజున పెళ్లి కాని ఆడపిల్లలు ఆహారాన్ని దానం చేస్తే దుర్గాదేవి ఆశీర్వాదాలను పొందుతారు.
కేవలం తాజా ఆహారాన్ని మాత్రమే దానం చేయాలి అని గుర్తుంచుకోవాలి. నిల్వ లేక పాడైన ఆహారాన్ని దానం చేయడం వలన అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందని భావిస్తారు. శ్రీ రామనవమి రోజున పేదలకు బట్టలు ఇవ్వడం వలన ఎంతో మంచి ఫలితాలు పొందవచ్చు. దానం చేసే సమయంలో ఇతరుల అవసరాలను అర్థం చేసుకుని నిస్వార్థంగా చేయడం చాలా అవసరం. పూజలతో పాటుగా రామాలయానికి వెళ్లి దీపం వెలిగించడం, కుంకుమను సమర్పించడం వంటివి చేస్తే ఐశ్వర్యాన్ని పొందవచ్చు. అదేవిధంగా రాముడికి అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, జీవితం మెరుగ్గా మారుతుందని పండితులు చెబుతున్నారు.
పాలల్లో కుంకుమ పువ్వు వేసి అభిషేకం చేయడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ రామనవమి రోజున ప్రసాదాన్ని సమర్పించి నైవేద్యం పూర్తి చేసిన తర్వాత అందరికీ పంచాలి. పూజలు, దానం, అభిషేకం వంటి సంప్రదాయాలను పాటించడం వలన ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. ఈ పండుగ రోజు చేసే దానం మరియు పూజలు శ్రేయస్సుకు దారితీస్తాయని అందరు నమ్ముతారు. ఈ విధంగా జీవితం సుఖసంతోషాలతో నిండిండి అని పండితులు చెబుతున్నారు. కనుక శ్రీరామనవమి పండుగను ఘనంగా జరుపుకోవడం ద్వారా ఇటువంటి మంచి ఫలితాలను ఎన్నో పొందవచ్చు.