గురువారం ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు. అలాగే ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావలసిందిగా ఆహ్వానించారు.
మరోవైపు నేడు ఖైరతాబాద్ లోని 70 అడుగుల ఎత్తైన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాన్ని అలంకరించనున్నారు. 10 గంటలకు శిల్పి రాజేంద్రన్ స్వామివారికి నేత్రాలంకన చేశారు. సెప్టెంబర్ 7 నుంచి నవరాత్రులు పూజలు అందుకోనున్నాడు గణనాథుడు. సెప్టెంబర్ 17న నిమజ్జనం చేయనున్నారు.
ఇక లక్షలాదిమంది భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రోజు వేలాదిమంది భక్తులు ఖైరతాబాద్ గణనాధున్ని దర్శించుకోనున్నారు.