రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిలేడీ హోంగార్డు !

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిలేడీ హోంగార్డు లీలలు బయటకు వచ్చాయి. వేములవాడకు చెందిన లేడీ హోంగార్డు వడ్ల అనూష బ్లాక్ మెయిల్ దందాలు తాజాగా బయట పడ్డాయి. భర్త ఆరోగ్యం బాగలేదంటూ, డబ్బున్న బడా బాబులను టార్గెట్ చేస్తూ లక్షల్లో డిమాండ్ చేస్తోందట వేములవాడకు చెందిన లేడీ హోంగార్డు వడ్ల అనూష.

Kiledi home guard in Rajanna Sirisilla district

రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్‌ దగ్గర రూ.3,50,000 అప్పుగా తీసుకొని, తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి వేములవాడకు చెందిన లేడీ హోంగార్డు వడ్ల అనూష బ్లాక్ మెయిల్ చేసిందట.

మరోసారి 5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసిందట..ఈ తరుణంలోనే పరువు కోసం చెల్లించారు శేఖర్. ఇక మళ్ళీ 3 లక్షలు డిమాండ్ చేయటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు శేఖర్. మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు విచారణలో వెల్లడించారు పోలీసులు.. అనూషను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news