లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా చేసేదేం లేదు : కిషన్ రెడ్డి

-

గత తొమ్మిదేళ్లలో కేంద్ర సర్కార్ 4 కోట్ల ఇళ్లు నిర్మించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని.. హామీలు ఎలా అమలు చేయాలనే దానిపై ఆ పార్టీకి సరైన రూట్‌ మ్యాప్‌ లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జీతాలు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా, ఓడినా వచ్చే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న తమ సర్కార్ 15 వందలకుపైగా పనికిరాని చట్టాలను రద్దు చేసిందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version