7 రోజుల్లో ‘నా సామిరంగ’ రూ.41.3 కోట్లు వసూళ్లు

-

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో కుర్ర హీరోల కంటే సీనియర్ స్టార్లే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో ఒక్కరు మాత్రమే ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయ్యారు.

The sensation of Sankranthi KING NaaSaamiRanga Continues

ఆయనే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. ఈసారి ఎలాగైనా బిగ్ సక్సెస్ ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఆయన ‘నా సామిరంగ’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి.

అయితే…’నా సామిరంగ’ సినిమా ఏడు రోజుల్లో రూ. 41.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ మూవీ ఈ నెల 14న థియేటర్లలో విడుదలైంది. ఇందులో అషికా రంగనాథ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రల్లో కనిపించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించగా, కీరవాణి సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version