స్థానిక సంస్థలు బలపడాలంటే బీజేపీ గెలవాలి : కిషన్ రెడ్డి

-

స్థానిక సంస్థలు బలపడాలంటే బీజేపీ గెలవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ మీటింగులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

“కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేసినా తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినా.. ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారు. “స్థానిక సంస్థలు బలపడాలంటే బీజేపీ గెలవాలి” అనే నినాదంతో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామ పంచాయితీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏమాత్రం చేయలేకపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ రాకుండా ఈ రెండు పార్టీలపై పోరాటం చేయాలి.” అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news