మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వేడి వాడిగా సాగుతోంది. టిఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ మంత్రులు రంగంలోకి దిగుతూ ఉంటే, బిజెపి తరఫున కేంద్ర నేతలు ప్రచారానికి వస్తున్నారు. అటు కాంగ్రెస్ తరపున మాజీ మంత్రులు సీనియర్ లీడర్లు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రావడం లేదు. నేడు ఆస్ట్రేలియాకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెళ్లనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఉన్ననేపథ్యలోనే.. నేడు ఆస్ట్రేలియాకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ ఆస్ట్రేలియాకు వెళుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… మళ్లీ నవంబర్ 7న తిరిగి హైదరాబాద్ రానున్నాడు. కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఎంత చెప్పినా.. ఆయన మాత్రం వినకుండా విదేశాలు వెళుతున్నారు.