సీఎం జగన్ ఓ భూత వైద్యుడు..వైసీపీ నేతలందరూ కామాంధులు – జనసేన

-

సీఎం జగన్ ఓ భూత వైద్యుడు..వైసీపీ నేతలందరూ కామాంధులు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌. అర్జంటుగా జగన్ని ఈఎన్టీ స్పెషలిస్టుకి చూపించాలని.. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి అసత్యాలు చెప్పారని పేర్కొన్నారు. ఒక‌ భూత వైద్యుడు వేద మంత్రాలు చదివినట్లు జగన్ కామెంట్లు చేశారని.. చెప్పేవి శ్రీరంగ నీతులన్న విధంగా జగన్ వ్యవహార శైలి కనిపిస్తుందని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు మాటలను ఎందుకు అదుపులో పెట్టలేదు..? అని ప్రశ్నించారు.

అవనిగడ్డ, పొలాల్లో పాములు వచ్చేవని.. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే కట్ల పాము వచ్చి పవన్ పై విషం చిమ్మిందన్నారు. విశాఖపట్నంలో పవన్ను ఎలా ఇబ్బంది పెట్టారో అందరూ చూశారు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు, సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ ని కలిశారన్నారు. జగనుకు భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యలతో అర్ధమైంది… వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ పాత్ర ఉందని అర్దమైందని చురకలు అంటించారు. మీ పార్టీలో కామ సూత్ర కమిటీ సభ్యులు కనిపించ లేదా..? గోరంట్ల , గంట, అరగంట, బంతి చామంతి అంటే జగన్ రెడ్డి ఏం చేశాడు..? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version