టిపిసిసి స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్ అయింది. మునుగోడులో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ చేసిన మాటలు ఇందులో రికార్డు అయ్యాయి. ఓ కాంగ్రెస్ లీడర్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ఈ దెబ్బ తో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ లో సంభాషణ జరిగింది. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా అధికారంలోకి తీసుకొస్తానంటూ ఆడియో కాల్ లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి… ఏదైనా ఉంటే నేనే చూసుకుంటానంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. చచ్చిన బతికిన రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని ఫోన్ కాల్ చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.