కేటీఆర్ ట్వీట్ల‌కే ప‌రిమిత‌మా? ఆస్ప‌త్రుల‌ను విజిట్ చేయ‌రా?

-

రాష్ట్రంలో క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. పేషెంట్లు బెడ్లు, ఆక్సిజ‌న్‌, రెమిడెసివిర్ ఇంజక్ష‌న్ దొర‌క్క నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో కేసీఆర్ సైతం ఇప్పుడు ఆస్ప‌త్రుల‌ను విజిట్ చేస్తున్నారు. కానీ కొవిడ్ కంట్రోల్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా ఉన్న మంత్రి కేటీఆర్ మాత్రం ట్విట్ట‌ర్‌లోనే స్పందిస్తున్నారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్లు, ఆక్సిజ‌న్లు, రెమిడెసివిర్ కొర‌త రాకుండా చూసుకునేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ క‌మిటీకి చైర్మ‌న్ గా మంత్రి కేటీఆర్ ఉన్నారు. కానీ ఆయ‌న ఏ ఒక్క రోజు కూడా టెస్టు కేంద్రాల‌కు, వ్యాక్సిన్ సెంట‌ర్ల‌కు, స‌మ‌స్య‌లు ఉన్న ఆస్ప‌త్రుల‌కు వెళ్ల‌లేదు.

కేవ‌లం ట్విట్ట‌ర్‌లోనే స్పందిస్తున్నారు. ఆస్క్ కేటీఆర్ అనే ప్రోగ్రామ్ పెట్టి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తున్నారు. కానీ క్షేత్ర‌స్థాయిలో విజిట్ చేయ‌కుండా ఉంటే క‌రోనా ఎలా కంట్రోల్ అవుతుంది. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సౌకర్యాలు ఎలా చేకూరుతాయ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్‌ను నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇంజ‌క్ష‌న్ల కోసం ట్విట్ట‌ర్‌లో అప్లై చేయాలంటూ చెప్ప‌డ‌మేంట‌ని గ‌ట్టిగానే అడుగుతున్నారు. సామాన్య జ‌నాల‌కు మెయిల్‌, ట్విట్ట‌ర్‌లో అప్లై చేయ‌డం ఎలా వ‌స్తుందంటూ మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి ప్క‌ర‌జ‌ల‌కు అవ‌స‌రాలు తీర్చాలంటూ కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version