ఎప్పుడైతే నెల్లూరు జిల్లాలోని కృష్ణ పట్నం ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా మందు బాగా పనిచేస్తోందని సోషల్ మీడియాలో వైరల్ అయిందో అప్పటి నుంచి గందరగోళం నెలకొంది. వరుసగా హాస్పిటళ్లలో సీరియస్ గా ఉన్న పేషెంట్లు క్రమక్రమంగా కృష్ణపట్నంకు పరుగు పెడుతున్నారు. వెళ్లిన వారందరూ కోలుకున్నామంటూ పోస్టులు, వీడియోలు పెడుతుండటంతో అంతా అటువైపు చూస్తున్నారు.
ఆనందయ్య ఉచితంగా పంపిణీ చేస్తున్న మందు బాగా పనిచేస్తోందని ఆ నోటా, ఈ నోటా అందరికీ తెలియడంతో ఇప్పుడు నెల్లూరు, దాని చుట్టు పక్కల ఆస్పత్రులన్నీ ఖాళీ అవుతున్నాయి. అందులోని పేషెంట్లు ఆనందయ్య వద్ద మందు తీసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
నెల్లూరులోని జీజీహెచ్ ఆస్పత్రిలోని పేషెంట్లు మొత్తం శుక్రవారం కృష్ణపట్నంకు పరుగులు తీశారు. దీంతో బెడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. కొన్ని కారణాలతో రెండ్రోజులుగా ఆగిపోయిన మందు పంపిణీ.. శుక్రవారం నుంచి మళ్లీ స్టార్ట్ చేస్తున్నట్టు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటించడంతో అంతా ఒక్కసారిగా ఎగబడుతున్నారు. ఈ రోజు దాదాపు 10వేలమంది మందుకోసం వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. 3కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సీఎం జగన్ ఈ మందుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పరిశీలించేందుకు ఐసీఎంఆర్ టీమ్‌ను పంపిస్తామని స్పష్టం చేశారు. మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంచే ఏర్పాట్లు చేస్తారా చూడాలి.