కేసీఆర్ అసెంబ్లీకి వస్తే…చుక్కలు చూపిస్తాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలతో కేటీఆర్ మాట్లాడుతూ… ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయి.. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు అన్నారు.
మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారు.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోండని కోరారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్గొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడింది..నల్గొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గెలుద్దామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.కోమటిరెడ్డి గత నవంబర్ నెలలోనే కరెంట్ బిల్లులు కట్టొద్దని ఆయన అన్నారు అని గుర్తు చేశారు. నల్గొండ ప్రజలు కరెంట్ బిల్లులు కట్టకుండా వాటిని కోమటిరెడ్డికి పంపించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.