అమెరికాలో ముగిసిన కేటీఆర్‌ పర్యటన

-

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత కొద్దిరోజులుగా విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే యూకే పర్యటన ముగించుకున్న కేటీఆర్.. ఆ తర్వాత అమెరికాలో పర్యటించారు. ఈరోజుతో కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ప్రతిపాదిత పెట్టుబడులతో రాష్ట్రంలో కొత్తగా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయని కేటీఆర్‌ కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది.

‘‘మంత్రి కేటీఆర్‌ లండన్‌, న్యూయార్క్‌, వాషింగ్టన్‌ డీసీ, హ్యూస్టన్‌, హేండర్‌సన్‌, బోస్టన్‌లలో పర్యటించి, 80కి పైగా వ్యాపార సమావేశాలకు హాజరయ్యారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపార విస్తరణకు వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ, మెడ్‌ట్రానిక్‌, స్టేట్‌ స్ట్రీట్‌, వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌, లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూపు, డాజోన్‌, టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ, అలియంట్‌, స్టెమ్‌క్రూజ్‌, మాండీ, జాప్‌కామ్‌ గ్రూప్‌లు ముందుకొచ్చాయి. ఫలితంగా బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, ఐటీ, ఐటీఈఎస్‌, మీడియా, వినోదం, ఏరోస్పేస్‌, రక్షణ, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైజెస్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌, ఇన్నోవేషన్‌, డేటా సెంటర్‌, ఆటోమోటివ్‌, ఈవీ రంగాల్లో కొత్తగా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి.” అని ప్రకటనలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version