అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తాజాగా వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్‌టుబుల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ అసాధారణ ప్రతిభను కనబరిచిందని, వరుసగా మూడు ఏళ్లు అవార్డులను గెలుచుకున్నట్లు అక్కడి అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులకు తెలిపారు. 2018, 2020, 2022 సంవత్సరాల్లో ఏరోస్పేస్ క్యాటగిరీలో తెలంగాణకు బెస్ట్ స్టేట్ అవార్డులు వచ్చినట్లు వెల్లడించారు. ఏరోస్పేస్ సిటీ ఆఫ్ ఫ్యూచర్ కేటగిరీలో హైదరాబాద్‌కు నెంబర్ వన్ ర్యాంకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణకు వస్తున్న అవార్డులు .. రాష్ట్రానికి గుర్తింపును ఇస్తున్నాయని, ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రం దూసుకువెళ్తున్నట్లు వివరించారు.
మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్‌టేబుల్ మీటింగ్ జరిగింది. ఈ ఈవెంట్‌లో అమెరికా ప్రఖ్యాత ఏరోస్పేస్ కంపెనీలు, అడ్వైజరీ సంస్థలు, స్టార్టప్‌లు పాల్గొన్నాయి. ఆయా కంపెనీలు డిఫెన్స్ రంగంపై చర్చలు నిర్వహించాయి. ఏరోస్పేస్ రంగంతో పాటు ప్రైవేటు సెక్టార్ డిఫెన్స్ పెట్టుబడులు భారీ పెరిగినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణలో గత తొమ్మిదేళ్ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగాయని, అమెరికాకు చెందిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంస్థలు హైదరాబాద్‌ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.