కేన్స్ లో ఐశ్వర్యా రాయ్ ఔట్ ఫిట్ పై నెటిజన్స్ ట్రోలింగ్

-

ఫ్రాన్స్‌లో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలబ్రిటీలు నూతన డిజైనర్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై హొయలుపోతూ కనిపిస్తున్నారు. ఈ ఏడాది కేన్స్ లో బాలీవుడ్ తారలు తళుకుమనిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మాజీ ప్రపంచ సుందరి కూడా వెండి గౌన్‌లో తళుక్కున మెరిసింది.

ఆమె ధరించిన ఈ వెండి హుడిపై కొందరు నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. ‘మీరు డిజైనర్‌ను మార్చండి’ అని ఒకరు అంటే.. ‘వెండి హుడీ ఏంటి విడ్డూరంగా’ అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు మాత్రం ఫ్యాషన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.

ఇక మరోవైపు నిన్న ఊర్వశి రౌతేలా  ధరించిన నెక్లెస్‌పై కూడా విభిన్న కామెంట్స్‌ వినిపించాయి. పింక్‌ కలర్‌ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా వచ్చిన ఊర్వశి.. మెడలో మాత్రం బల్లి నెక్లెస్‌ను ధరించింది. చెవి రింగులు కూడా అలాంటివే పెట్టుకోవడంతో నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ‘ఆ నెక్లెస్‌ కిందపడితే నిజం బల్లి అనుకొని భయపడతారేమో జాగ్రత్త’ అని కామెంట్స్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version