పొంగులేటి బాంబులపై కేటీఆర్ కౌంటర్..అవి తుస్సు బాంబులే !

-

ktr counter on ponguleti bombs: పొంగులేటి బాంబులపై కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. పొంగులేటిపై జరిగిన ఈడీ రైడ్లపై, దొరికిన నోట్ల కట్టలపై, అదానీ కాళ్లు మొక్కి కేసులు కాకుండా చేసుకున్న బాంబులు చెప్తాడా? అంటూ సెటైర్లు పేల్చారు. లేదంటే అమృత్ స్కాంలో రేవంత్ రెడ్డి బావమరిది తీసుకున్న కాంట్రాక్ట్ రూ.1137 కోట్ల గురించి బీజేపీ వాళ్లతో జరిగిన పొత్తు బాంబు గురించి చెప్తాడా? అని నిలదీశారు.

ktr counter on ponguleti bombs

అవి లక్ష్మి బాంబులా, సుత్తిలి బాంబులా, తుస్సు బాంబులా తెలుస్తది అని సెటైర్లు పేల్చారు కేటీఆర్. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన నాడు మనం తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉన్నామన్నారు. పారిశ్రామికవేత్తలు పవర్ హాలిడేస్ వద్దని ఇందిర పార్క్ వద్ద ధర్నాలకు దిగిన పరిస్థితి. మరో వైపు రైతులు కరెంట్ లేక తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version