బీజేపీ ఎంపీ కంగనా కోసం కేటీఆర్ పోరాటం..!

-

తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి.. ట్వీట్ పోస్ట్ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా మహిళల పట్ల గౌరవం ఉండాలి. మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యానించకూడదు. ఎంపీ కంగనా రనౌత్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ వాడిన నీచమైన భాష ఆమోదయోగ్యం కాదన్నారు.

ఆమె పార్టీ సిద్దాంతాలతో తాను ఏకీభవించకపోవచ్చు. కానీ ఎమ్మెల్యే  ప్రసంగం ఇంత స్థాయికి దిగజారకూడదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో మౌనం వహించడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. అటువంటి కల్మషానికి వారి ఆమోదాన్ని ప్రతిబింబిస్తుందా? Mr.
@రాహుల్ గాంధీ అంటూ.. ట్వీట్ చేశారు. అస్సా సీఎం హిమంత బిశ్వశర్మ సోనియాగాంధీ అవమానకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు తెలంగాణలోని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి స్పందించకముందే.. ముందుగా ఖండించిన ఘనత కేసీఆర్ దే అని గుర్తు చేశారు. మీ పార్టీలో ఉన్నతమైన ప్రమాణాలు నెలకొల్పాలని.. మీ క్యాడర్ కు విలువలు నేర్పించాలని కోరుతున్నాను. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని కోరుతున్నట్టు ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version