మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

-

తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో కేటీఆర్ తరపు లాయర్ ఉమా మహేశ్వరరావు దావా దాఖలు చేశారు. కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు కేటీఆర్.  బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, తుల ఉమను సాక్ష్యులుగా పేర్కొన్నారు. ఇప్పటికే కొండా సురేఖ పై టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో నాగార్జున స్టేట్ మెంట్ రికార్డు చేసింది కోర్టు. మరోవైపు సాక్షి సుప్రియ కూడా స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్ మెంట్ ను తీసుకొని తదుపరి చర్యలు తీసుకోనుంది. ఓ వైపు కేటీఆర్.. మరోవైపు నాగార్జున కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేయడంతో ఆమె మంత్రి పదవీ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version