రేవంత్ రెడ్డి సొంత ఇల్లు FTLలో ఉంది : కేటీఆర్

-

ప్రభుత్వాలు అమానవీయంగా ప్రవర్తించినప్పుడు ప్రజల ఆవేదన ఇలాగే ఉంటుంది. ప్రభుత్వం దుర్మార్గంగా, కిరాతకంగా వ్యవహరిస్తుంది అని కేటీఆర్ అన్నారు. మూసి నదీ అభివృద్ధి ఆధునీకరణ ఎందుకు చేస్తున్నారు అంటే ఒక్క అధికారి వద్ద కూడా ఎలాంటి సమాధానం లేదు. 1920 నుంచి 2024 వరకు మూసి నదీ తో ఎలాంటి వరద సమస్య రాలేదు. 2020లో మాత్రం భారీ వర్షాలతో ఒక్క సారి ఇబ్బందులు తలెత్తాయి. కాంగ్రెస్ వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు తిరిగి వాళ్ళే కూల్చుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1.6 కిలో మీటర్ల పరిధిలో ప్రజల వెయ్యి కోట్ల నిర్మాణాలు కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు. 240 కిలో మీటర్ల గంగా నది సుందరీకరణ కు కేంద్రం రూ.45 వేల కోట్లు ప్రకటిస్తే.. కేవలం 55 కిమీల మూసి కి రూ.1.55 లక్షల కోట్లు ఖర్చు చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించాడు.

ఇప్పటివరకు కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా మత పరమైన ఘర్షణలే. కానీ BRS ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి కి తావు లేకుండే. గ్రేటర్ లో BRS ను గెలిపించడంతో రేవంత్ రెడ్డి కక్ష్య కట్టారు. రాహుల్ గాంధీ బుల్డోజర్ లు సహించేది లేదంటున్నారు..కానీ ఇక్కడ మాత్రం బుల్డోజర్ లతో కూల్చుతున్నారు. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు FTLలో ఉంది. వాళ్ల అన్న తిరుపతి రెడ్డి ఇళ్ళు కూడా చెరువలోనే ఉంది.. మంత్రుల ఇళ్ళు కూడా చెరువుల్లో ఉన్నాయి..వాటిని మాత్రం కూల్చరు. రేవంత్ ముందు నీ ఇంటిని కూల్చి ఆదర్శంగా నిలవాలి. పేదవాళ్ల ఇళ్ళు కూల్చితే చూస్తూ ఊరుకోం అని కేటీఆర్ పేర్కొన్నారు,

Read more RELATED
Recommended to you

Exit mobile version