నా భర్తను అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు : నందిగామ సురేష్ భార్య

-

నందిగామ సురేష్ ని అరెస్ట్ చేసి 25 రోజులు అవుతుంది. జైల్లో ఉన్న సురేష్ కు షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు అని నందిగామ సురేష్ భార్య బేబీ లత పేర్కొన్నారు. ప్రస్తుతం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆయన తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయండి. కానీ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. కాబట్టి ఈరోజు ఎస్సీ కమిషన్ కలిసి మా సమస్యలన్నీ చెప్పుకున్నాం. నా భర్త తప్పు చేసి ఉంటే ఆధారాలు చూయించండి.. ఆ తర్వాత అరెస్ట్ చేయండి అని ఆమె అన్నారు.

అలాగే క్రిస్టియన్ ఓట్లు మీకు ఆక్కర్లేదా అని టీడీపీని ప్రశ్నించిన ఆమె.. జగన్ క్రిస్టియన్ నా హిందువా అంటూ ఎందుకు కామెంట్ చేస్తున్నారు. అన్ని మతాలను గౌరవించాలి. జగన్ అన్ని మతాలను గౌరవిస్తున్నారు. ఈ విషయంలో భగవంతుడు కచ్చితంగా బుద్ధి చెప్తాడు అని బేబీ లత అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version