తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్… విశ్వబ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో.. విశ్వ బ్రాహ్మణులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలంటూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
శ్రీకాంత్ ఆచారి అమరుడైనాడు కాబట్టే.. ఈ రోజు మీరు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే.. విశ్వబ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు.
“మొన్న జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులను (చారీలను) నేను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న ప్రచారం అవాస్తవం. ఒక కులాన్ని లేదా ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదు. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుని ఉద్దేశించి అన్న మాట వలన ఎవరైనా బాధపడితే ఆ మాటని ఉపసంహరించుకుంటు న్నాను.” అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.