ఇది ప్రజాప్రభుత్వం కాదు.. బుల్డోజర్ సర్కార్ అంటూ KTR ట్వీట్ చేశారు. ఉన్న ఒక్క గూటినీ మీ బుల్‌డోజర్ ప్రభుత్వం కూల్చివేస్తే, కడుపుమండి, కన్నీళ్ళతో కిరసనాయిలు పోసుకున్నందుకు కేసులు పెడతారా? అనిఆగ్రహించారు. ఎంత సిగ్గుచేటు! ఎంతటి నీతిమాలిన చర్య! అన్నారు. మీది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన కాదు రేవంత్ రెడ్డి గారు! మీరు నడుపుతున్నది బుల్‌డోజర్ ప్రభుత్వం పేర్కొన్నారు. ఇది కేసుల రాజ్యమని… మంచి నీళ్లను కూడా వదలని జూటా కాంగ్రెస్ అంటూ ఆగ్రహించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గాలికి వదిలి-బిఆర్ఎస్ పథకాలపై ప్రతాపం. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి బతుకు ఆగమాగం అన్నారు. తాము ప్రకటించిన గృహ జ్యోతి తూట్లు పొడిచిన కాంగ్రెస్ ఇప్పుడు బిఆర్ఎస్ అమలు చేసిన 20వేల లీటర్ల ఉచిత మంచి నీరు పథకం పై కుట్రలు చెయ్యడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఒక వైపు రుణమాఫీ కాలేదు, డబ్బులు కట్టండి అని రైతులకు నోటీసులు, మరో వైపు నిరుపేదల ఇండ్లకు హైడ్రా నోటీసులు, ఇప్పుడు నల్లా బిల్లు అంటూ డోర్లకు బిల్లులు అతికెయ్యడం అన్నారు.