జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. మంగళవారం రోజున దేవరా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన సంబరంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సినిమా విడుదలకు మరో 15 రోజుల పాటు సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే దేవర చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుకుతోంది.
సినిమా రిలీజ్ అయ్యే ముందు.. అంటే ఫ్రీ రిలీజ్ ఆ సమయంలో దేవర నుంచి మరో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందట చిత్ర బృందం. ఈ దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారు అని సమాచారం అందుతుంది. అదే సమయంలో దేవర నుంచి రెండవ ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తే కచ్చితంగా అభిమానులకు.. పండగ వాతావరణం అని చెప్పవచ్చు అంటున్నారు. కాక దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేయగా జాన్వీ కపూర్ హీరోయిన్గా చేశారు.