మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం : కేటీఆర్

-

వైద్య సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా? అంటూ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. స్థానికత విషయంలో ప్రభుత్వం తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. 9 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులే స్థానికులన్నారని.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇతర రాష్ట్రాల విద్యార్థులే లోకల్ అవుతారని పేర్కొన్నారు.

‘హైదరాబాద్లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారు. దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది.’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో మన విద్యార్థులు వైద్య సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందన్న కేటీఆర్.. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version