79,574 ఎకరాలకే నష్ట పరిహారమా…ఇది నిజంగా వంచనే – కేటీఆర్‌

-

79,574 ఎకరాలకే నష్ట పరిహారమా…ఇది నిజంగా వంచనే అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహించారు. వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని…వంచనతో మళ్లీ ముంచిన సర్కారు..పరిహారం కాదు.పరిహాసమన్నారు కేటీఆర్‌. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే..వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయమని ఆగ్రహించారు. 4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు..వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా..? అంటూ మండిపడ్డారు.

పంట నష్టం అంచనాలను తల్లకిందులుగా ఎందుకు మార్చేసారు..? ఏకంగా 3లక్షల 35 వేల ఎకరాలు ఎట్లా ఎగిరిపోయాయి..? 79,574 ఎకరాలకే కంటి తుడుపుగా పరిహారం ఇచ్చి మమ అనిపించడం దారుణమని పేర్కొన్నారు. అపార నష్టంతో అల్లాడుతున్న రైతుల ఆదుకునే విషయంలోనూ ఉదారంగా వ్యవహరించలేరా..? మానవత్వం ప్రదర్శించలేరా..? అంటూ నిలదీశారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 5.20 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్రం రిపోర్ట్ ఇచ్చింది నిజం కాదా..? ఇప్పుడు ఇంత భారీ కోతలా? అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version