కాంగ్రెస్ సీనియర్ ఫిరోజ్ ఖాన్ VS నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ మధ్య ఘర్షణ వ్యవహరం ప్రస్తుత రాజకీయాల్లో సెన్సెషనల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఫిరోజ్ ఖాన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఎంఐఎం అక్రమాలను బయటపెట్టినందుకే తనపై ఆ పార్టీ నేతలు దాడులకు తెగబడేందుకు సిద్ధమయ్యారని, ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి దీనికి ఒక ముగింపు పలకాలన్నారు.
తనపై దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్టేట్‌మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు వివరిస్తానని ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో కమ్యూనల్ వయొలెన్స్ లేదన్నారు. ఇదంతా ఎంఐఎం ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. తమతో సన్నిహితంగా లేకుంటే మతఘర్షణలు అవుతుందనేలా మాట్లాడుతున్నారన్నారు.ఓవైసీ కాలేజీనీ హైడ్రా కూల్చడం నూటికి 100 శాతం జరుగుతుందన్నారు. కేటీఆర్ గురించి కొండా సురేఖ వాస్తవాలే మాట్లాడారని కానీ, ఆ అంశాలను పబ్లిక్‌లో చెప్పడం ఆమె స్థాయికి తగదన్నారు. ఇక కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే మళ్లీ గెలవదని ఆరోపించారు.