బాజిరెడ్డి గోవర్ధన్ గళం.. నిజామాబాద్‌కు బలం అన్నారు KTR. కష్టాల్లో, కన్నీళ్లలో జనం తోడుంటూ.. అందరివాడుగా.. నిజామాబాద్ ప్రజల ముద్దుబిడ్డగా ఎదిగిన రైతుబిడ్డ మన బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అహంకారంతో, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ… విద్వేషాలను నింపుతూ సాగుతున్న నిజామాబాద్ రాజకీయాల్లో సౌమ్యుడిగా ప్రజలందరి ఆప్తుడిగా పనిచేస్తున్న నాయకుడు బాజిరెడ్డి అని తెలిపారు కేటీఆర్.
ఏ పదవిలో ఉన్న ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతూ, కేసీఆర్ గారి సైనికుడిలా భుజం కలిపి పని చేసే ప్రజా నాయకుడు అన్నారు. పంచకట్టుతో.. ప్రేమతో.. మాటలు కాదు చేతల్లో చేసి చూపించే నిఖార్సైన మన నిజామాబాద్ బిడ్డ అని.. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన బాజిరెడ్డి గోవర్ధన్ గారి గళం.. నిజామాబాద్‌కు బలం అని వెల్లడించారు. విద్వేష రాజకీయాలకు చెక్ పెడదాం.. కారు గుర్తుపై ఓటేసి బాజిరెడ్డి గారినే గెలిపించుకుందాం… మన బాజిరెడ్డి.. మన నిజామాబాద్.. మన కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్.