త్వరలో ఇంటింటికి ఇంటర్ నెట్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పించన్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. ఐదేళ్లు వైసీపీ నేతలు దోచుకున్నారు. వైసీపీ హయాంలో రోడ్లు ఎలా ఉన్నాయి.. ఇప్పుడెలా ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 80 రోడ్లను వేయించామని తెలిపారు.
గతంలో రోడ్లన్ని గుంతలమయంగా ఉండేవని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. తాను డ్వాక్రా మహిళలను పరిచయం చేసినప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు డ్వాక్రా మహిళా సంఘాల వల్లనే కొంతమంది మహిళలు తమ పిల్లలను చదివించుకుంటున్నాయని తెలిపారు. నీటిని పొదుపు చేయాలని సూచించారు. చిత్తూరు జిల్లాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. అమరావతిని మళ్లీ పట్టాలెక్కిస్తామని తెలిపారు. వర్షాకాలంలో 9 మీటర్లు.. వర్షాకాలం తరువాత 3 మీటర్లుండాలన్నారు. మ్యాంగో ఆధార పరిశ్రమలు పెడితే.. ఉపాధి అవకాశాలు, గిట్టుబాటు ధర వస్తుందని తెలిపారు.