ఢిల్లీ నుంచి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్పాలి – కేటీఆర్

-

ఢిల్లీ నుంచి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు,100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు అని పేర్కొన్న కేటీఆర్‌… ఇప్పుడు,300 రోజుల తర్వాత, ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని ప్రజలకు సమాధానం చెప్తారా ? అని ప్రశ్నించారు.

KTR on rahul gandhi

దీనిపై ఢిల్లీ నుంచి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  కాగా నేడు మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు వెళ్లనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్ గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉంటుంది. అనంతరం అత్తాపూర్ లోని కిషన్ బాగ్ ప్రాంతాల్లోని ప్రజలతో భేటీ కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version