KTR: రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజన్ అంటే = మోడీ + అదానీ !

-

కేటీఆర్ మరో సంచలన పోస్ట్‌ పెట్టారు. రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజన్ అంటే = మోడీ + అదానీ అని.. అందుకే వాళ్లిద్దరికి కావాల్సివన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూసుకుంటున్నాడని వివాదస్పద పోస్ట్‌ పెట్టారు. మూసీ పుట్టిన ప్రాంతం దామగుండం వద్ద 12 లక్షల చెట్లను నరికేసే, 2900 ఎకరాల అటవీ భూమిని మోడీ ఆదేశాలను అనుసారం ఆయనకు అప్పగించాడని నిప్పులు చెరిగారు.

KTR, revanth reddy

మూసీ పుట్టే ప్రాంతం నాశనమైన సరే తన బడేభాయ్ ఆజ్ఞను మాత్రం పాటిస్తున్నాడని.. ఇటు మూసీ దిగువన రామన్నపేటలో అంబుజా సిమెంట్ ప్లాంట్ కోసం బూటకపు పబ్లిక్ హియరింగ్ నిర్వహించటం ద్వారా అదానీ జీని సంతృప్తి పరుస్తున్నాడని ఆగ్రహించారు. నిజానికి ఈ భూమిని తెలంగాణలో డ్రై పోర్ట్ కోసం కేటాయించటం జరిగింది. కానీ మోడీ + అదానీ కోసం ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మాణం కోసం అదానీకి మేలు చేస్తోందని తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా రూ లక్షా 50 వేల కోట్లతో మూసీ ప్రాజెక్ట్ సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే అన్ని దుర్మార్గాలు, అవినీతి పై బీజేపీ మౌనంగా ఉంటుందని వివరించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version