ఈటల రాజేందర్ అసెంబ్లీలో ర్యాంగింగ్ చేసిన కేటీఆర్

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ర్యాంగింగ్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడే హుజూరాబాద్‌లో ఒక ఐటీ కంపెనీ ప్రారంభించామని గుర్తు చేసిన కేటీఆర్… ఆయన బీజేపీలోకి పోగానే అది బంద్ అయిందంటూ చురకలు అంటించారు. తెలంగాణలో కులగజ్జి, మత పిచ్చి లేదు.. స్టేబుల్ గవర్నెన్స్ కేసీఆర్ నాయకత్వంలో ఉందని వివరించారు.

బెంగుళూర్‌ను వెనక్కి నెట్టి ఐటీలో, ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. ప్రతిపక్షాలు కూడా ఐటీ అభివృద్ధిని అభినందించాల్సినదే.. 44 శాతం ఉత్పత్తి హైదరాబాద్ నుంచే.. రజినీకాంత్ లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ గురించి చెప్పారని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. 1987లోనే ఇంటర్ గ్రాఫ్ పేరుతో ఐటీ ఏర్పడింది.. మేమే తెచ్చాం అని చెప్పుకునే వారు తెలుసుకోవాలి.. ఈటలకు కూడా తెలవాలని ఫైర్‌ అయ్యారు కేటీఆర్. ఈరోజు హైదరాబాద్‌లో ఎకరం 100 కోట్ల రూపాయలు పలుకుతుంది అంటే ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లే సాధ్యమైందన్నారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version