“ఐటీ” లో బెంగుళూరు ను వెనక్కు నెట్టాం : మంత్రి కేటీఆర్

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఈ రోజు అసెంబ్లీ లో పురపాలశాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న తీరు గురించి చాలా గొప్పగా వివరించారు. మంచి లీడర్ షిప్ ఉండడం వలనే ప్రభుత్వం ప్రజలకు నచ్చిన పాలనను అందిస్తోందని సంతోషంగా కేటీఆర్ చెప్పారు. తెలంగాణ లో కులగజ్జి మరియు మతపిచ్చి లేవు అని అందుకే ఇంత అభివృద్ధి పధంలో దూసుకు వెళుతున్నామని మంత్రి కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ .. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఐటీ రంగంలో బెంగుళూరు మిన్నగా ఉండేది, కానీ ఇప్పుడు తెలంగాణ బెంగుళూరు ను వెనక్కు నెట్టేసి అగ్రస్థానానికి వచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఐటీ ప్రాజెక్టు లను విస్తరింపచేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ముందు ముందు ఐటీ లో తెలంగాణను మించిన రాష్ట్రము ఇంకేదీ ఉండదు, అంతలా తీర్చి దిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.

ఇవన్నీ మరిచిపోయి చాలా మంది ప్రతిపక్ష నేతలు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు, ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version