రాజకీయ ప్రతీకారమే బీజేపీ ఏకైక ఉద్దేశం.. కేజ్రీవాల్ అరెస్టుపై కేటీఆర్‌

-

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టుపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ చర్యను ఆప్‌ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మరోవైపు పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. అరవింద్ కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండించినట్లు పేర్కోన్నారు. అణచివేతకు ఈడీ, సీబీఐలు బీజేపీ చేతిలో ప్రధాన సాధనాలుగా మారాయని వెల్లడించారు. నిరాధారమైన ఆరోపణలతో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారన్న కేటీఆర్… రాజకీయ ప్రతీకారమే బీజేపీ ఏకైక ఉద్దేశం అని విమర్శించారు.

మరోవైపు ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా స్పందిస్తూ భారత్‌ అప్రకటిత అత్యవసర పరిస్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. మన ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో ఉందని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సీఎంను అరెస్టు చేశారన్న చడ్డా.. ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. కేజ్రీవాల్‌ అరెస్టు ప్రతిపక్షాల గొంతు నొక్కే దుర్మార్గపు పన్నాగమని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version