రాసిపెట్టుకోండి అంటూ కేటీఆర్‌ సంచలన ట్వీట్..!

-

ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసుల్లో తెలిపారు. వాస్తవానికి ఈ-రేస్‌ కేసులో నేడు ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్లాల్సి ఉంది. అయితే కోర్టు తీర్పు ఉన్నందున నేడు విచారణకు రాలేనన్నారు కేటీఆర్‌.. కేటీఆర్‌ వినతికి ఆమోదం తెలిపిన ఈడీ. ఈనెల 16 విచారణకు రావాలని మళ్లీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసులో రేపు విచారణకు రావాలని BLN రెడ్డికి, ఎల్లుండి విచారణకురావాలని అరవింద్‌కు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు.

తాజా పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. “నా మాటలు రాసిపెట్టుకోండి. ఎదురు దెబ్బల నుంచి బలంగా తిరిగొస్తా. మీ అబద్ధాలు నా గొంతు నొక్కలేవు. మీ చర్యలు నా లక్ష్యాన్ని అడ్డుకోలేవు. మీ తాటాకు చప్పుళ్లకు నేను బెదరను. ఆలస్యంగానైనా నిజాలు నిగ్గుతేలుతాయి. న్యాయవ్యవస్థను గౌరవిస్తా. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది” అంటూ.. కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version