ఢిల్లీ నేస్తం – అవినీతి హస్తం : కేటీఆర్

-

కాంగ్రెస్ పార్టీపై ట్విటర్ లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేసారు.. అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వాళ్లు.. కాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్ల.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్ళి వలసలకు పచ్చజెండా ఉపినవాళ్లు తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు అని పేర్కొన్నారు.

అలాగే ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు.. సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారు. సుద్దపూస ముచ్చట్లు చెప్పే మీరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధలు ఎలా తుంగలో తొక్కారు. ఒక మీటింగ్ లో త్వరగా టెండర్లు పిలవాలి అని ఆదేశం – మరో మీటింగ్ లో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు. ప్రాజెక్టు పూర్తి అయ్యి కోటి ఏకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరం పై కమిషన్ లు వేసి విచారణ చేస్తున్న మీపై ఇప్పుడు ఏ కమిషన్ వెయ్యాలి అని ప్రశ్నించిన కేటీఆర్.. ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version