ఇద్దరు పిల్లలను పెంచడటంలో ఈ తప్పులు అస్సలు చేయకండి

-

ఒకర్ని పెంచడం వేరు, ఇద్దరు పిల్లల్ని పెంచడం వేరు. ఎందుకంటే.. ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లల పెంపకం మీద చాలా అవగాహన ఉండాలి. అటు ఇటుగా ఒకే వయసులో ఉన్న ఇద్దరు పిల్లలను పెంచే క్రమంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వారి బాల్యంలో ఏర్పడిన బీజం పెరిగి పెద్దదై వారి ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పిల్లల మధ్య సఖ్యత ఉండాలన్నా, ఎలాంటి గొడవలు రాకూడదన్నా తల్లి దండ్రుల పెంపకం ముఖ్య పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

ఏం చేయాలి:

తేడాలను గౌరవించండి:

ప్రతి బిడ్డ విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. పెద్దోడిలానే చిన్నోడు ఉండాలి అని అనుకోకండి. ఇలాగే ఉండాలని బలవంతపెట్టడం కన్నా వారికున్న విభిన్న లక్షణాలను ప్రేమించాలి. ఇద్దరూ ఒకరిలో ఉన్న భిన్న లక్షణాలను గౌరవించేలా, ఇష్టపడేలా నేర్పించాలి.

పిల్లల కోసం టాస్క్‌లను రూపొందించండి:

పిల్లలిద్దరికీ కలిపి కొన్ని ఇద్దరు కలిసి ఆడుకోగల ఫన్నీ టాస్కులు ఇవ్వాలి. దానివల్ల కలిసి పనిచేయడంతో పాటూ, ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకుంటారు.

ఒకరికొకరు తోడుండేలా:

మనం ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో పిల్లలకు చిన్న వయసు నుంచే నేర్పించాలి. ఒకరిమీద ఒకరికి శ్రద్ధ, ఆప్యాయత చూపించేలా అలవాటు చేయాలి. వారి తోడబుట్టిన బంధం బలంగా ఉంటుంది.

కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోండి:

చిన్న చిన్న గొడవలను పట్టించుకోకుండా ఉండొచ్చు. పిల్లలకు కాస్త సమయం ఇవ్వాలి. కానీ ఏదైనా గొడవ, మాటల విషయంలో తీవ్రంగా అనిపిస్తే వెంటనే జోక్యం చేసుకోవాలి. తప్పేంటో వివరంగా తెలియజెప్పాలి.

ఏం చేయకూడదు:

ప్రేమలో పక్షపాతం

ప్రేమ ఇద్దరి పిల్లల మీద సమానంగా ఉండాలి. చాలామంది ఆడపిల్లను ఒకలా అదే వయసులో ఉన్న పిల్లాడిని మరోలా చూస్తారు. ఒకరిని తక్కువ ఎక్కువ చేసి చూస్తే మరొకరికి వాల్ల మీద శతృత్వం పెరుగుతుంది. ఎప్పటికీ అలా చేయకండి. ఇద్దరూ ఒకటే అనే భావన మీలో ఉండాలి.

పోటీని సృష్టించడం:

మనం పిల్లల మధ్య పోటీని సృష్టించకూడదు. ఒకరినొకరు ప్రేమించుకోవడం, అన్ని సమయాల్లో కలిసి ఉండటం నేర్పించాలి.

పట్టించుకోకపోవడం:

వాళ్లిద్దరి మధ్య సంబంధం పాడవుతున్నపుడు, ఎవరైనా ఒకరు ఇంకొకర్ని ఇబ్బంది పెడుతున్నపుడు పట్టించుకోకుండా ఉండటం సరికాదు.

ఒకరినే చూసుకోమనడం:

ఇద్దరికీ ఒకరి గురించి ఒకరు కేర్ తీసుకోవడం నేర్పించాలి. ఆ బాధ్యత ఒకరిమీదే ఉంచకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version