జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు – KTR

-

రాజకీయాల్లో హత్యాలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో పోయి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కేటీఆర్ పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నేను, కవిత వచ్చి గల్లీ గల్లీలో తిరిగి మన అభ్యర్ధులను గెలిపించుకొని సంజయ్‌ను జగిత్యాల నుండి తరిమికొడుదామని పిలుపు నిచ్చారు.

రేవంత్ రెడ్డి నువ్వు మొగోడివైతే.. నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి.. ఎన్నికలకు రా అంటూ గులాబీ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన సవాల్‌ చేశారు. ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజీకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటదన్నారు కేటీఆర్.

జగిత్యాలను జిల్లా చేసింది మెడికల్ కాలేజీ తీసుకువచ్చింది కేసీఆర్ అని… అలాంటి జిల్లాను మెడికల్ కాలేజీని రద్దు చేస్తామన్న పార్టీలోకి సంజయ్ కుమార్ వెళ్ళాడని ఆగ్రహించారు. సొంత ప్రయోజనాలు నాలుగు డబ్బులు సంపాదించుకునేందుకే పార్టీ మారాడు సంజయ్ అంటూ నిప్పులు చెరిగారు. జగిత్యాల ఎమ్మెల్యే బండగట్టుకుని బాయిల దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version