BRS పార్టీకి 70-88 సీట్లు వస్తాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈసారి బీఆర్ఎస్ కు 88 స్థానాలకు పైగా వస్తాయని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు బిజెపి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు నెంబర్ 2 కోసమే పోటీ పడుతున్నాయని ఓ టీవీ ఛానల్ కాంక్లేవ్ లో పేర్కొన్నారు. నెంబర్ 1 స్థానం ఇప్పటికీ కేసీఆర్ వద్దే ఉందని నిన్న వచ్చిన సర్వే రిపోర్ట్ లో తేలిందన్నారు.
అటు హైదరాబాద్ పరిధిలో టూరిస్ట్ ప్రాంతాలు తక్కువగా ఉన్నాయన్న మంత్రి….ఈసారి తనకు టూరిజం శాఖ ఇవ్వాలని కేసిఆర్ ను కోరుతానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై బీఆర్ఎస్ నేత మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మార్పు రావాల్సిన అవసరం లేదని, 2014లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రూపంలో మార్పు వచ్చిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా రాజకీయ నిరుద్యోగులే మార్పు కోరుకుంటున్నారే తప్ప ప్రజలు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదని కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.