నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన..షెడ్యూల్ ఇదే

-

నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. 10 గంటలకు వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శాయంపేట హవేలికి చేరుకుంటారు మంత్రి కేటీఆర్‌. 10.15 గంటలకు కైటెక్స్ టెక్స్టైల్ పార్కు భూమి పూజ , మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన , యంగ్వన్ ఫొటో డెమో కార్య క్రమం , గణేష్ ఎకోపెట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవం , అనంతరం అధికారులు , ప్రజాప్రతినిధులతో సమావేశం జరుగనుంది.


10.30 గంటలకు పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరుగనుండగా… 11.30 గంటలకు శాయంపేట హవేలి నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. 12 గంటలకు మామునూర్ ఎయిర్పోర్ట్ సందర్శన ఉండగా.. మధ్యాహ్నం 12.45 గంటలకు మామునూర్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు పయనం కానున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో కాజీపేట సెయింట్ గాబ్రియల్ గ్రౌండు, 1.15 గంటలకు రాంనగర్లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నివాసంలో భోజన విరామం, 2.00 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలు , ఎంపీలు , ప్రజాప్రతినిధు లతో సమావేశం ఉండనుంది. 3 గంటలకు విలేకరులతో సమావేశం, 3.45 గంటలకు నయీంనగర్ లోని చైతన్య డిగ్రీ కళాశాలలో సాఫ్ట్ పాత్ సిస్టం ఐటీ ఆఫీసు ప్రారం భోత్సవం ఉండనుంది. 4.15 గంటలకు వడ్డెపల్లిలోని పీజేఆర్ గార్డెన్స్లో జరిగే సాఫ్ట్ పాత్ సిస్టం ఐటీ కంపెనీ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 5:45కు సెయింట్ గాబ్రియల్ మైదానానికి చేరుకొని హెలికాప్టర్లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version