కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ లేఖ రాశారు. వ్యవసాయం తరువాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగంపై మోడీ ప్రభుత్వానికి చిన్నచూపు, నిరాసక్తత ఉందని.. మోడీ ప్రభుత్వం టెక్స్ టైల్ – చేనేతరంగం కూడా కక్ష కట్టిందని ఆగ్రహించారు.
అందుకే చేనేతపైన జియస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. శుష్క వాగ్దానాలు–రిక్త హస్తాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్ తెలంగాణ నేతన్నల కడుపు కొడుతుందని ఫైర్ అయ్యారు.
ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు వల్లె వేసే అసత్యాలు మాని తెలంగాణ నేతన్నకు సహాయం చేస్తే మంచిదని హితవని.. తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి, చేనేత కార్మికులకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నయా పైసా అదనపు సాయం చేయలేదని తెలిపారు. కేంద్ర జౌళీ, టెక్స్ టైల్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు కేటీఆర్. దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్రం సహాయం ఎక్కడ ? అని నిలదీశారు.
సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు ఎటూ పోయింది? హైదరాబాద్ నగరంలో నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం నుంచి స్పందన ఏది? అని నిప్పులు చెరిగారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యండ్ లూమ్ టెక్నాలజీ ఎర్పాటు ఎక్కడ? అని మండిపడ్డారు. పవర్ లూం మగ్గాల అప్ గ్రేడేషన్ కు కేంద్రం నిధుల అంశం ఏమైంది? అని ఫైర్ అయ్యారు. 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత పైన జిఎస్టీ రద్దు చేయాలి, టెక్స్ టైల్స్ పైన జియస్టీ తగ్గించాలని.. కేంద్ర టెక్స్ టైల్ శాఖకు మంత్రులు మారుతున్నారే కాని తెలంగాణ విజ్ఞప్తులకు మాత్రం సానుకూల స్పందన రావడం లేదన్నారు. ఈ అంశాలన్నింటిపై టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో సైతం నిలదీస్తారని తెలిపారు కేటీఆర్.