తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి చర్చ నడుస్తూనే ఉంది…ఇప్పటికే గత రెండేళ్ల నుంచి ఈ ముందస్తుపై చర్చ జరుగుతూ వస్తుంది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రతిపక్షాలు అంటూనే ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు సైతం ముందస్తుపై మాట్లాడుతూ వస్తున్నాయి. కానీ ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని టీఆర్ఎస్ నేతలు కూడా క్లారిటీ ఇస్తూ వచ్చారు.
కానీ ఈ మధ్య కేసీఆర్..బీజేపీతో ఛాలెంజ్ చేయడంలో భాగంగా…ఎన్నికల తేదీని చెప్పండి…అప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్దామని అన్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందస్తుకు సై అన్నాయి..అయితే కేటీఆర్ వచ్చి…తాము పూర్తికాలం అధికారంలో ఉంటామని ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. దీంతో ముందస్తుపై చర్చ ఆగిపోయింది. తాజాగా మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మరోసారి ముందస్తు చర్చ మొదలైంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు…అలాగే స్పీకర్ కు కూడా రాజీనామా పంపించి..ఆమోదింపచేసుకుంటానని అంటున్నారు. అలాగే ఈ నెల 21న బీజేపీలో చేరతానని ప్రకటించారు. రాజగోపాల్ రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమవుతుంది. ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తుంది.
అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక…ఒక సెమీ ఫైనల్ లాంటిదని చెప్పొచ్చు…ఇందులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓడిపోతే అంత ఇబ్బంది ఉండదు…అధికారంలో ఉన్న పార్టీ గెలిచిందని అనుకుంటారు. కానీ అధికారంలో టీఆర్ఎస్…దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల మాదిరిగా…మునుగోడులో ఓడిపోతే ఇంకా అంతే సంగతులు.
ఈ ఉపఎన్నికలో ఓడిపోతే…సాధారణ ఎన్నికల్లో చాలా ప్రభావం ఉంటుంది…అప్పుడు బీజేపీ ఇంకా దూకుడుగా ఉంటుంది…ప్రజా మద్ధతు ఆ పార్టీకే ఉందనే పరిస్తితి ఉంటుంది…దీని వల్ల టీఆర్ఎస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఇలాంటి పరిస్తితుల నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికకు వెళ్ళడం కంటే ఏకంగా అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే బెటర్ అని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయట. అటు మునుగోడు ఉప ఎన్నికలకు కాకుండా ముందస్తు ఎన్నికలకే కేసీఆర్ మొగ్గు చూపొచ్చని ప్రచారం కూడా వస్తుంది. మొత్తానికి తెలంగాణలో ముందస్తుపై చర్చ నడుస్తూనే ఉంది.