దానం, కడియం, తెల్లంలపై కఠినంగా శిక్షలు వేయాల్సిందేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై హై కోర్టు తీర్పు స్వాగతిస్తున్నామని…తెలిపారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి.. అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని పేర్కొన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సభ్యత్వ రద్దు చేస్తూ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నుకున్న పార్టీల నుంచి మారి ఇతర పార్టీలకు వెళ్లి ప్రజలను మోసం చేయడం తప్పు అన్నారు.
పార్టీ మార్పు లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. వరద ముంపు ప్రాంతాలను ఆదుకోవడంలో కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలను వేరువేరుగా చూస్తోందని…వరద ముంపు ప్రాంతాల ప్రజలు నీళ్లలో ఉంటే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మానవత్వంతో మాట్లాడలేదన్నారు. ఒకవైపు ప్రజల్లో ఇబ్బందులు పడితే యూనిలిటి నిధులు వాడుకోవాలని అని కిషన్ రెడ్డి అనడం కరెక్ట్ కాదని తెలిపారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించి… 10 వేల కోట్లు కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.