BJPతో బీఆర్ఎస్​కు దోస్తీ కుదిరింది.. అందుకే : కూనంనేని

-

బీఆర్ఎస్​తో పొత్తు విషయంలో దెబ్బతిన్న వామపక్షాలు సీపీఎం, సీపీఐ తాజాగా మీడియా సమావేశం నిర్వహించాయి. బీఆర్ఎస్​తో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా దూషించమని.. విధానపరంగా మాత్రం వ్యతిరేకిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. బీజేపీతో బీఆర్​ఎస్ పార్టీకి సఖ్యత ఏర్పడిందని అన్నారు. బీజేపీ ప్రమాదం కాదా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

“ఇప్పుడు బీజేపీతో బీఆర్ఎస్​కు మిత్రత్వం ఏర్పడిందా? మిత్రధర్మం పాటించరా? కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. రాజకీయం అంటేనే మోసం అనే నిర్వచనం ఇస్తున్నారు. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ ఏమయ్యేది. బీజేపీ అండదండలుంటే చాలని మీరనుకుంటున్నారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. మేము కూడా గెలవడానికి తుదివరకు పోరాడుతాం. సీపీఐ, సీపీఎం పొరపచ్చాలు లేకుండా కలిసే ఉన్నాయి. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం. కమ్యూనిస్టులం ఐక్యంగా సత్తా చాటుతాం. కేసీఆర్‌ నిర్ణయంతో మాకేమీ నష్టం లేదు. నష్టపోయేది కేసీఆరే తప్ప మేము కాదు.” అని కూనంనేని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version