కేంద్రం ఎన్నో స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీములతో చాలా మంది లాభాన్ని పొందుతున్నారు. రైతుల కోసం ఎన్నో స్కీమ్స్ వచ్చాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్రం రైతుల కోసం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా చాలా మంది రైతులు ప్రయోజనం ని పొందుతున్నారు. పీఎం కిసాన్ పథకం పెట్టుబడి సాయాన్ని పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఏడాదికి రూ. 6 వేలు మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి మనకు తెలుసు దీన్ని మరో 50 శాతం వరకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అలా జరిగితే పీఎం కిసాన్ స్కీము కింద ఇకపై రూ. 9 వేల వరకు రైతులు అకౌంట్ లో పడతాయి. ప్రతిపాదనలు ప్రధాన మంత్రి కార్యాలయం ముందు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ విషయంపై కేంద్రం అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ దీన్ని పెంచితే కేంద్రంపై ఏడాదికి మరో రూ. 30 వేల కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ఇది ఇలా ఉంటే ఇంకొన్ని నెలలలో రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కేంద్రం రైతులకు పెట్టుబడి సాయం పెంచేందుకు చూస్తోందట.