కాంగ్రెస్ లోకి శాసనమండలి చైర్మన్ గుత్తా..?

-

G తొలుత టీడీపీలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. 2009 ఎన్నికల్లో టీడీపీలో పొత్తులో భాగంగా నల్లగొండ ఎంపీ స్థానం సీపీఐకి వెళ్లింది. దీంతో గుత్తా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. ఆ తరువాత 2014 లో నల్గొండ నుంచి ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించారు.

ఆ తరువాత.. బీఆర్ఎస్ లో చేరి.. రైతుబంధు కమిటి చైర్మన్ గా.. శాసన మండలి చైర్మన్ గా కీలక బాధ్యతలు చేపట్టారు. తాజాగా గుత్తాకు బీఆర్ఎస్ నుంచి టికెట్ రాలేదు. దీంతో జగదీశ్ రెడ్డి గుత్తాకు టికెట్ రాకుండా చేశారనే రూమర్స్ కూడా వినిపించాయి. నల్గొండ ఎంపీ టికెట్ కంచర్ల  కృష్ణారెడ్డికి దక్కడంతో గుత్తా కాస్త నిరాశలో ఉన్నారు. త్వరలోనే గుత్తా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. తాజాగా నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఆయనను కలిశారు. ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని గుత్తాను కోరారు. తొలుత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి.. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్టు తెలుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version