మనమంతా ముక్తకంఠంతో తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుదాం : కేటీఆర్

-

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ప్రభుత్వంతో కలిసి వస్తాం.. కలిసి పోరాడుదాం. భారతదేశంలో 156 మెడికల్ కళాశాలలు ఇచ్చారు. కానీ తెలంగాణకు కేంద్రం ఒక్కటి కూడా ఇవ్వలేదు. కేంద్ర విద్యాలయాలు ఇవ్వలేదు. ఒకవైపు కొట్లాడాం. మరో వైపు మనం సొంతం ఏర్పాటు చేసుకున్నాం. యాచిస్తే.. తెలంగాణ రాదు.. శాసిస్తే వస్తుంది.. అలాగే బడ్జెట్ విషయంలో జరిగిందన్నారు.

బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీకి డబ్బులు ఇచ్చారు సంతోషం. గిరిజన యూనివర్సిటీని పోరాటాలతోనే సాధించామన్నారు. రూ.24వేల కోట్లు కేటాయించాలని నీతి అయోగ్ చెప్పినప్పటికీ ఇవ్వలేదు. వెయ్యి గురుకుల పాఠశాలలు నిర్మించుకున్నాం. బడ్జెట్ లో తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడం బాధకరం అన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేము తెలంగాణ పక్షం. మనమంతా ముక్తకంఠంతో తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుదామని పేర్కొన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version