హింసాత్మక, దుర్వినియోగ ట్రోల్ అని అభివర్ణించినందుకు బీజేపీ నాయకుడు సురేష్ కరంషి నఖువా పై పరువు నష్టం దావా వేసిన తరువాత ఢిల్లీ కోర్టు తాజాగా యూట్యూబర్ దృవ్ రాథీకి సమన్లు జారీ చేసింది. సాకేత్ కోర్టులోని జిల్లా జడ్జి గుంజన్ గుప్తా జూలై 19న ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర ఉపశమనం కోసం నఖువా చేసిన అభ్యర్థనపై కోర్టు కూడా రాతీకి నోటీసు జారీ చేసింది. మరియు తదుపరి ఆగస్టు 6న విచారణ జరుపుతుందని పేర్కొంది.
నఖువా తరపున న్యాయవాదులు రాఘవ్ అవస్తీ, ముఖేష్ శర్మ వాదనలు వినిపించారు. బీజేపీ ముంబై యూనిట్ ప్రతినిధఇ నఖువా రాథీ తనను హింసాత్మక, దుర్వినియోగ ట్రోల్స్ లో భాగమని పేర్కొన్నారని.. ఆరోపనలు కారణం లేకుండా ఉన్నాయని, అతని ప్రతిష్టను దిగజార్చే ధోరణిని కలిగి ఉన్నాయని ఆరోపించారు. డిజిటల్ ప్లాట్ ఫారమ్ లలో దావనంలా వ్యాపించే అత్యంత రెచ్చగొట్టే ప్రతివాది.. నిరాధారమైన దావాలు వేశాడు.