హైదరాబాద్ మెట్రోలో వెళ్లేవారికి బిగ్ రిలీఫ్ దక్కింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీల విషయంలో దిగొచ్చిన ఎల్ అండ్ టి..పెంచిన మెట్రో చార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన హైదరాబాద్ మెట్రో చార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మెట్రో సంస్థ.

ఇక ఈ తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుండి అమలులోకి రానున్నట్టు ప్రకటించిన మెట్రో రైలు సంస్థ.. ఉత్తర్వులు జారీ చేసింది. దింతో హైదరాబాద్ మెట్రోలో వెళ్లేవారికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఇక అంతకు ముందు హైదరాబాద్ మెట్రో చార్జీలు పెంచారు. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన మెట్రో రైలు సంస్థ … పెంచిన చార్జీలు మే 17) నుండి అమలులోకి తీసుకువచ్చింది. అయితే తాజాగా పెంచిన హైదరాబాద్ మెట్రో చార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మెట్రో సంస్థ.